సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరోసారి హారర్ కథలపై మక్కువ పెరిగినట్టు కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వర్మ దర్శకత్వం వహించిన సినిమాలకు ఆశించిన విజయాలు అందకపోయినా, ఆయన ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. వర్మనే కాకుండా, ఆయన శిష్యులూ పలు ప్రాజెక్టులు చేస్తున్నారు కానీ, వాటికీ పెద్దగా స్పందన కనిపించలేదు. ఈ మధ్యకాలంలో వర్మ ఎన్నో ప్రాజెక్ట్‌లను ప్రకటించినా, అవి చాలా వరకు కార్యరూపం దాల్చలేదు. అయినా సరే, తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతున్న వర్మ తాజాగా మరో హారర్ చిత్రాన్ని ప్రకటించాడు.
‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే టైటిల్‌తో ఈ కొత్త సినిమాను వర్మ అధికారికంగా ప్రకటించాడు. “మీరు చనిపోయిన వారిని చంపలేరు” అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో సినిమాకు వినూత్నమైన మూడ్‌ని సెట్ చేస్తున్నాడు. మేజర్ పాత్రలో టాలెంటెడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ నటిస్తున్నారు. కథ విషయానికి వస్తే – “మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు పరుగెత్తుతాం. కానీ పోలీసులే భయపడితే వారు ఎక్కడికి వెళ్లాలి?” అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ చుట్టూ కథ నడవనుంది. ఓ ఘోరమైన ఎన్‌కౌంటర్ తర్వాత దెయ్యాల వాసం మిగిలిన పోలీస్ స్టేషన్‌లో పోలీసులు గ్యాంగ్‌స్టర్ల ఆత్మల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసే ఘటనల చుట్టూ కథ తిరుగుతుంది.
వర్మ ఈ సినిమాపై భారీ నమ్మకంతో ఉన్నాడు. హారర్, థ్రిల్లర్, కామెడీ అంశాలను కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాడు. గతంలో ‘రాత్రి’, ‘దెయ్యం’, ‘భూత్’, ‘కౌన్’ వంటి సినిమాలతో ఈ జానర్‌లో తనదైన ముద్ర వేసిన వర్మ, ఈ సినిమాతో మరోసారి తన హవాను రీపీట్ చేయాలని భావిస్తున్నాడు. ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాపై ఇప్పటినుంచే చర్చ మొదలైన సంగతి చెప్పాల్సిన పనిలేదు.
After SATYA, KAUN and SHOOL I am thrilled to announce , me and @BajpayeeManoj are once again teaming up for a HORROR COMEDY a genre which neither of us did
— Ram Gopal Varma (@RGVzoomin) April 9, 2025
I have done horror , gangster, romantic , political dramas , adventure capers, thrillers etc but never a HORROR COMEDY…

One thought on “మళ్లీ హారర్ మూడ్‌లో వర్మ.. ‘పోలీస్ స్టేషన్ మే భూత్’తో బాక్!”
Comments are closed.