అక్కినేని అఖిల్ తన వ్యక్తిగత జీవితం ద్వారా మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల జైనాబ్ రవ్జీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసినప్పటి నుంచి ఈ జంటపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా, బీచ్ సైడ్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నా సర్వస్వం” అంటూ అఖిల్ ఇచ్చిన క్యాప్షన్ ఆ ఫోటోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం అక్కినేని వర్గాలే వెల్లడించగా, పెళ్లి తేదీపై మాత్రం ఇంకా అధికారిక సమాచారం లేదు. అయితే బీచ్‌లో ఒకేలా కాస్ట్యూమ్ ధరించి ఒకరిని ఒకరు హత్తుకున్న ఈ జంటను చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీపై మురిసిపోతున్నారు. ఫోటోలో కనిపిస్తున్న భావోద్వేగం చూసిన నెటిజన్లు “లవ్ బర్డ్స్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రొఫెషనల్ పరంగా చూస్తే, ‘ఏజెంట్’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ‘లెనిన్’ అనే టైటిల్‌తో ఓ కొత్త ప్రయోగాత్మక సినిమా కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ దర్శకత్వం వహించనుండగా, శ్రీలీల హీరోయిన్గా నటించనుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అఖిల్ అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

One thought on “బీచ్ సైడ్‌లో అఖిల్ – జైనాబ్ రొమాంటిక్ క్లిక్”
Comments are closed.