హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన, తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో పోటీ చేయగల రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.
టోక్యోలోని సుమిదా నదిలో పడవ ప్రయాణం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, అక్కడి రివర్ ఫ్రంట్‌ను పరిశీలించామని తెలిపారు. మూసీ నది ప్రక్షాళన పనులకు కొందరు అడ్డుగొడుతున్నా, మనం ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు.
ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు తెలంగాణకు స్పష్టంగా ఉన్నాయని, అందుకు మీ అందరి సహకారం అవసరమని జపాన్‌లోని తెలుగువారిని ఉద్దేశించి తెలిపారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉండే ఆనందం మీకు బాగా తెలుసని అన్నారు.

One thought on “తెలంగాణ అభివృద్ధికి ప్రపంచంతో పోటీ..”
Comments are closed.