తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి: రిజర్వేషన్ల అమలుకు జనాభా లెక్కలు అవసరం…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా కార్యక్రమంలో పాల్గొని, స్థానిక సంస్థలు మరియు చట్ట సభల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు జనాభా లెక్కలు తేలాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీల గొంతు వినిపించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

“జనాభా వివరాలు తెలియకుండానే రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యంకాదని కోర్టులు స్పష్టం చేశాయి” అని ఆయన అన్నారు.

జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “మా పార్టీ విధానం ప్రకారం, దామాషా ప్రకారం నిధులు మరియు నియామకాలు చేపట్టాలనే ఆలోచన ఉంది” అని స్పష్టం చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బీసీలను బలపర్చే ఆలోచన లేదని ఆయన విమర్శించారు. అలాగే, రాహుల్ గాంధీ దేశంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

Read More : నాగర్కర్నూల్‌లో 30 ఏళ్ల మహిళపై బలాత్కారం, బంధువును దాడి..