హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం క్షీణతకు గురైందని ప్రముఖ సినీ నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజల్లో అభివృద్ధిపై భరోసా ఉండేదని, ఆ విశ్వాసంతోనే రియల్ ఎస్టేట్ రంగం వేగంగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు.
కానీ, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నమ్మకం ప్రజల్లో లేకపోవడంతో పెట్టుబడులు తగ్గిపోయాయని, దీంతో రంగం కుదేలైందని అన్నారు. పరిస్థితుల ప్రభావంతో హైదరాబాద్ నుంచి పలు బిల్డర్లు, కాంట్రాక్టర్లు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలవైపు తరలిపోతున్నారని తెలిపారు.
కొత్త పెట్టుబడులు ఆకర్షించగలిగినప్పుడే రియల్ ఎస్టేట్ రంగం పునరుజ్జీవనం చెందుతుందని రామ్మోహన్ రావు స్పష్టంచేశారు. ప్రభుత్వానికి ప్రజల నమ్మకమే ఆర్థిక రంగాల్లో ప్రగతికి పునాదిగా ఉంటుందని సూచించారు.
Read More : రమ్యశ్రీపై సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరుల దౌర్జన్యం

2 thoughts on “రియల్ ఎస్టేట్ క్షీణతపై రామ్మోహన్ రావు ఆవేదన”
Comments are closed.