హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూవివాదం మరింత ఉద్రిక్తంగా మారింది. తమ విశ్వవిద్యాలయ భూములను కాపాడుకునేందుకు ఎంత పోరాటమైనా చేస్తామని హెచ్సీయూ విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ మేరకు నిరసనలు చేపట్టిన విద్యార్థులపై ఉగాది రోజు పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు.

ప్రభుత్వం తమ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ ఓ విద్యార్థి నిరాహార దీక్షకు దిగాడు. అయితే పోలీసులు అతన్ని తీసుకెళ్లి, నిరాహార దీక్ష జరుగలేదని అబద్ధపు ప్రచారం చేశారని విద్యార్థులు మండిపడ్డారు. “ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?” అంటూ వారు ప్రశ్నించారు.
అంతేగాక, క్యాంపస్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడం, డ్రోన్ ఎగరేస్తే అరెస్టులు చేయడం వంటి చర్యలపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని రక్షించుకునేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాటం ఆగదని హెచ్సీయూ విద్యార్థులు స్పష్టం చేశారు.
Read More : ఫార్మాసిటీ భూసర్వే వద్ద రైతుల ఆందోళన..
