కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్న నటి రమ్యపై జరుగుతున్న బెదిరింపుల అంశంపై ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ స్పందించారు. హీరో దర్శన్ అభిమానులు రమ్యకు అత్యాచార బెదిరింపులు చేస్తున్న నేపథ్యంలో, ఈ తరహా ప్రవర్తనను ఆయన తీవ్రంగా ఖండించారు. “తల్లి, అక్క, భార్య, కూతురు… ఇలా మాత్రమే కాకుండా ప్రతి మహిళను ఒక వ్యక్తిగా గౌరవించడం మనందరి బాధ్యత. రమ్యపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు పూర్తిగా అంగీకారయోగ్యం కానివి. సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణకు వేదిక మాత్రమే కానీ, ఇతరులను అవమానపరిచే లేదా బెదిరించే వేదిక కాదు. రమ్య, నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. ఈ విషయంలో నీ పోరాటానికి మేం పూర్తి మద్దతు ఇస్తాం” అని శివరాజ్‌కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.
ఇక రమ్య ఇప్పటికే బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దర్శన్ అభిమానులు తనపై ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన బెదిరింపు సందేశాలు, అసభ్యకరమైన పోస్టుల స్క్రీన్‌షాట్‌లను పోలీసులకు సమర్పించారు. ఇటీవల రేణుకాస్వామి హత్యకేసు విషయమై రమ్య సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల తర్వాత దర్శన్ అభిమానులు ఆమెను లక్ష్యంగా చేసుకొని దారుణమైన కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. “రేణుకాస్వామి బదులు నిన్నే చంపి ఉండాల్సింది” వంటి తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
Read More : పవన్ కళ్యాణ్‌కి 34 ఏళ్ల తర్వాత కరాటే సీనియర్‌తో మళ్లీ కలయిక

One thought on “రమ్యపై బెదిరింపులు తీవ్రం”
Comments are closed.