జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు? – రోజా ప్రశ్న

మాజీ మంత్రి రోజా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. “జగన్‌ గారిని 11 సీట్ల పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యేగా ఎగతాళి చేసే ఈ ప్రభుత్వం ఆయన పర్యటనలపై ఎందుకు ఆంక్షలు విధిస్తోంది?” అని రోజా ప్రశ్నించారు.

ప్రజల సమస్యలను తెలుసుకోవడానికే జగన్ పర్యటనలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు. “జగన్ గారి పర్యటనలతో ఈ ప్రభుత్వానికి ఏం భయం? ప్రజలు నిజాలు తెలుసుకుంటారనే భయంతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారా?” అని ఆమె నిలదీశారు.

జిల్లా పర్యటనల్లో మాజీ ముఖ్యమంత్రిపై ఆంక్షలు విధించడం సరైంది కాదని రోజా స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్న ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేత పర్యటనలను అడ్డుకోవడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు.

Read More : ఏపీలో త్వరలో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు

One thought on “జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు? – రోజా ప్రశ్న

Comments are closed.