హరిహర వీరమల్లు ట్రైలర్‌పై రామ్‌చరణ్ ప్రశంసలు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హరిహర వీరమల్లు ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ దాని శక్తివంతమైన విజువల్స్ మరియు గ్రాండ్ స్కోప్‌తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ… “#HariHaraVeeraMallu ట్రైలర్ ఈ సినిమా గొప్పతనాన్ని, దాని భవ్యతను అద్భుతంగా చూపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు పెద్ద తెరపై కనిపించడం మనందరికీ ఒక గొప్ప అనుభూతి. ఆయన నుంచి మరో అద్భుతమైన పాత్రను చూస్తాం” అంటూ వ్యాఖ్యానించారు.

రామ్‌చరణ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, సినీప్రేమికులు ఈ సినిమాపై మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లుగా పవన్ కల్యాణ్ ఎలా కనిపించబోతున్నారు? అనే ఆసక్తి టాలీవుడ్‌ వర్గాల్లో నెలకొంది.

Read More : పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల