ఆర్జీవీకి హైకోర్టులో ఊరట – ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ కేసుపై స్టే

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఓ కేసుపై హైకోర్టు స్టే విధించింది. 2019లో విడుదలైన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి నమోదు చేసిన కేసుపై విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

గుంటూరు సీఐడీ పోలీసులు ఈ సినిమాపై విద్వేషపూరిత కంటెంట్ ఉందని ఆరోపిస్తూ వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే, తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడే ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించిన హైకోర్టు, ఈ కేసుపై విచారణకు తాత్కాలిక స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఫిర్యాదుతోనే విచారణ
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సీఐడీ, వర్మకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే, ఈ చర్యలను సవాల్ చేస్తూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ కేసుకు సంబంధించి వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఐదేళ్ల తర్వాత సినిమాపై ఫిర్యాదు చేయడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, కేసుపై విచారణకు తాత్కాలిక స్టే విధిస్తూ సీఐడీ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read More

One thought on “ఆర్జీవీకి హైకోర్టులో ఊరట – ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ కేసుపై స్టే

Comments are closed.