ఓటీటీలో మోస్ట్ వాచ్డ్ లిస్ట్‌లోకి ది రైల్వే మెన్ వెబ్ సిరీస్!

The Railway Man OTT series

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో “ది రైల్వే మెన్” అనే వెబ్ సిరీస్ హాట్ టాపిక్‌గా మారింది. కేవలం నాలుగు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ ప్రేక్షకులను భావోద్వేగంతో ఊపేస్తోంది. థ్రిల్లర్, సస్పెన్స్, నిజ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌లో ప్రతీ సీన్ ఉత్కంఠత రేకెత్తించేలా ఉంది.

1984 డిసెంబర్ 2న జరిగిన భోపాల్ గ్యాస్ విపత్తు నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌లో ఆ రోజున రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకున్న వాస్తవిక ఘటనలను అద్భుతంగా చూపించారు. ఇది ఒక వైపు విధ్వంసం కథ అయినప్పటికీ, ఆ ప్రమాద సమయంలో రియల్ హీరోలు ఎలా ప్రాణాలు తీసిపెట్టి ఇతరులను కాపాడారన్న దానిపై ఫోకస్ పెట్టారు.

ఆర్. మాధవన్, కెకె మీనన్, బాబిల్ ఖాన్, సన్నీ హిందూజా, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో జూహి చావ్లా కూడా గెస్ట్ రోల్‌లో కనిపిస్తుంది. బాబిల్ అద్భుతమైన నటనతో ప్రత్యేకంగా మెప్పిస్తున్నాడు.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉంది. క్లిష్టమైన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More


One thought on “ఓటీటీలో మోస్ట్ వాచ్డ్ లిస్ట్‌లోకి ది రైల్వే మెన్ వెబ్ సిరీస్!

Comments are closed.