బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన “మేరీ హస్బండ్ కి బివి” సినిమాలో ఫిజియోథెరపిస్ట్‌గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్, ఈ సినిమాతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, వ్యక్తిగతంగా ఆమె జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం చోటు చేసుకుంది.
“ధృవ” ఫేమ్ రకుల్, తన భర్త జాకీ భగ్నానితో మాల్దీవుల్లో తొలి వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు హాజరయ్యారు, దీంతో ఈ సందర్భం మరింత విశేషంగా మారింది. సెలబ్రేషన్ నుంచి అందమైన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రకుల్, “ఇది ఒక అద్భుతమైన, మధురమైన అనుభవం… మా కుటుంబం అంతా కలిసి సెలవులను ఆస్వాదించడం నా మనసును నిండుగా చేసింది. మా యానివర్సరీకి మరొకటి ఏముంటుంది?” అంటూ హర్షం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సినీ రంగంలో “ఇండియన్ 2”, “దే దే ప్యార్ దే 2”, “దిశ” వంటి ఆసక్తికర ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.

One thought on “రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ యానివర్సరీ: మాల్దీవుల్లో జాకీ భగ్నానితో జోష్‌ఫుల్ సెలబ్రేషన్!”
Comments are closed.