లార్డ్స్‌కు భారీ నష్టం

WTC

డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌లో భారత్ గైర్హాజరీతో 4 మిలియన్ యూరోలు నష్టం**

లండన్: క్రికెట్ మక్కా లార్డ్స్ (Lord’s) స్టేడియానికి భారీ ఆర్థిక నష్టం ఏర్పడనున్నది. వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC 2025) ఫైనల్‌కు భారత్ అర్హత సాధించకపోవడంతో లార్డ్స్‌కు సుమారు 4 మిలియన్ యూరోలు (దాదాపు 36 కోట్ల రూపాయలు) ఆదాయ నష్టం వాటిల్లనుంది.

భారత క్రికెట్ జట్టు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభిమానుల సంఖ్యను కలిగి ఉండటమే కాకుండా, భారత క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో మ్యాచ్‌లను వీక్షించేందుకు స్టేడియానికి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భారత్ ఫైనల్‌కు చేరకపోవడం వల్ల టికెట్ల విక్రయం, ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల వంటి ఆదాయాల్లో గణనీయమైన లోటు ఏర్పడనుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2023లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారీ సంఖ్యలో భారత క్రికెట్ అభిమానులు హాజరయ్యారు. ఈసారి భారత్ గైర్హాజరైతే స్టేడియంలోని ప్రేక్షకుల హాజరు తగ్గడంతో పాటు లార్డ్స్‌కు అంచనా వేసిన ఆదాయంలో నష్టపోతుందని తెలుస్తోంది.

Read More