మోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్లను వరుసగా అందిస్తున్న నేపథ్యంలో “ఆఫీసర్ ఆన్ డ్యూటీ“ కూడా అదే జానర్‌లో మరో ఆసక్తికరమైన సినిమా. కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో, జితు అష్రఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైంది.
ఈ రెండు వెర్షన్లు రేపు (శుక్రవారం, మార్చి 14, 2025) థియేటర్లలో సందడి చేయనున్నాయి. టికెట్ బుకింగ్‌లు సాధారణ థియేటర్లలో ప్రారంభమయ్యాయి, కానీ మల్టీప్లెక్స్ చైన్‌లు మాత్రం సినిమాను స్క్రీన్ చేయడానికి నిరాకరించాయి.
ఫిబ్రవరి 20, 2025న మలయాళ వెర్షన్ థియేటర్లలో విడుదలై, ఈ నెలాఖరులో మల్టీ-లాంగ్వేజ్ ఓటిటీలో విడుదలకు సిద్ధంగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అన్నది చూడాలి.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకుంటాయా? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.

One thought on “‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ తెలుగు, తమిళ విడుదలకు సిద్దం – మల్టీప్లెక్స్‌లలో రిలీజ్‌కు బ్రేక్!”
Comments are closed.