సినీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించిన కమల్ హాసన్ తన కెరీర్‌లో వివాదాలకు చాలా దూరంగా ఉన్నా, దశావతారం సినిమా సమయంలో ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.
2008లో విడుదలైన దశావతారం సినిమా కమల్ హాసన్ నటనకు విశేషమైన గుర్తింపును తీసుకువచ్చింది. కానీ ఈ సినిమాకు సంబంధించి సెంధిల్ కుమార్ అనే అసోసియేట్ డైరెక్టర్ కోర్టుకు వెళ్లి కథ తనదే అని ఆరోపించారు.
సెంధిల్ కుమార్ ప్రకారం, తాను కమల్ హాసన్‌కు ఈ కథను వివరించానని, అప్పట్లో ఆయన టీమ్ కూడా తనతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. కానీ అనంతరం తనకు ఎలాంటి సమాచారం లేకుండానే సినిమా ప్రారంభమైందని, తన స్క్రిప్ట్‌ను అనధికారికంగా వినియోగించుకున్నారని ఆరోపించారు.
ఈ వివాదం పెద్దదై, ఒక సమయంలో సెంధిల్ మీడియా ముందుకు రానున్నట్లు చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే, నిర్మాతలు ముందుకొచ్చి ఆయనతో సెటిల్‌మెంట్ చేశారని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
కమల్ హాసన్ హాలీవుడ్ సినిమాల కథలను మార్ఫ్ చేసి సినిమాలు చేసే అలవాటు ఉందని, అందుకే ఈ వివాదం నిజమే అయ్యే అవకాశం ఉందని అప్పట్లో చాలామంది అభిప్రాయపడ్డారు. సెంధిల్ కుమార్ ఆరోపణలు ఇప్పటికీ తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగానే ఉన్నాయి.

One thought on “కమల్ హాసన్‌పై దశావతారం స్క్రిప్ట్ వివాదం!”
Comments are closed.