ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ నియమితులైనప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆయనను హృదయపూర్వకంగా అభినందించారు. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన వారు, మాధవ్ నేతృత్వంలో కూటమి బలోపేతానికి, రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దామని ఆకాంక్షించారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ, “ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన మాధవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కూటమిలోని మూడు పార్టీల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి కలిసి పనిచేద్దాం” అని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకైన మాధవ్, ఎమ్మెల్సీగా యువత, నిరుద్యోగుల సమస్యలపై వేదికలపై గళమెత్తారని కొనియాడారు. జాతీయవాద దృక్పథంతో కూటమి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఎన్. రామచందర్ రావుకూ పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా, తర్వాత ఎమ్మెల్సీగా ప్రజా గళంగా ఆయన పనిచేసిన తీరు ఆయన గుర్తు చేశారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విజయవంతం అవుతారని ఆశించారు.
మంత్రి నారా లోకేశ్ కూడా స్పందిస్తూ, ఉభయ రాష్ట్రాల్లో నియమితులైన నేతలు గతంలో శాసనమండలిలో ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపించారని పేర్కొన్నారు. వారి అనుభవంతో రెండు రాష్ట్రాల అభివృద్ధికి వారు కృషి చేస్తారని అభిలషించారు.
Read More : 19 జిల్లాలకు హెచ్చరికలు, మత్స్యకారులకు సూచనలు

2 thoughts on “ఏపీ బీజేపీ చీఫ్‌గా మాధవ్‌కు అభినందనలు”
Comments are closed.