రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్‌ను రష్యా నుంచి ఆయిల్ కొనకుండా ఆపాలని ట్రంప్ యత్నిస్తున్నప్పటికీ, ఈ చర్యలు భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలను ఏమాత్రం దెబ్బతీయలేకపోయాయి.
ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. అయితే పుతిన్ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈ ఏడాది చివర్లో ఆయన భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ‘ఇంటర్‌ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ’ పేర్కొంది.
ఇదిలా ఉంటే, భారత్‌పై మరో 25 శాతం సుంకాలు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ నిర్ణయం వెలువడిన ఒక్క రోజులోనే పుతిన్ భారత పర్యటన వార్త చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ చూస్తుంటే, భారత్-రష్యా బంధం ఎంత గాఢంగా ఉందో మరొకసారి స్పష్టమవుతోంది.
Read More : ఘనాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

One thought on “భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్..?”
Comments are closed.