పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని అక్రా నుంచి ఒబువాసికి బయలుదేరిన సైనిక హెలికాప్టర్ మిడ్వేలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో దేశ రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్‌తో పాటు మరో ఆరుగురు అధికారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జెడ్-9 మోడల్ హెలికాప్టర్ ఉదయం అక్రా నుండి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే కమ్యూనికేషన్ కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. తీరానికి సమీపంలో హెలికాప్టర్ శకలాలు కనిపించటంతో ఆపరేషన్ ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మృతదేహాలను వెలికి తీశాయి. అన్ని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తేలకపోయినా, ప్రాథమికంగా సాంకేతిక లోపమే కారణంగా అనుమానిస్తున్నారు. నిపుణుల బృందం ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఘనా ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా ప్రకటించింది.
Read More : భారత్‌పై అమెరికా సంచలన నిర్ణయం

One thought on “ఘనాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం”
Comments are closed.