ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జాతినుద్దేశించి కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ సైనిక దళాల ధైర్య సాహసాలను చూసి ప్రపంచ నాయకులు ఆశ్చర్యానికి గురవుతున్నారని, దేశ ప్రజల స్థైర్యం పట్ల కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయని ఆయన బుధవారం స్పష్టం చేశారు.
ఇరాన్ అణు ముప్పును ఎదుర్కొనే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఇటీవల ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ప్రత్యేక సైనిక చర్య చేపట్టింది. ఈ దాడులకు ప్రతిగా టెహ్రాన్ నుంచి తీవ్ర స్పందన రావడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నెతన్యాహు మాట్లాడుతూ – “ప్రపంచ నేతలతో నేను మాట్లాడుతున్నాను. మన సైనిక దళాల నిబద్ధత, విజయం వారిని ఆకట్టుకుంటోంది. అలాగే, ఇజ్రాయెల్ పౌరుల ధైర్యం వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది” అని అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నెతన్యాహు. “ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్న ట్రంప్‌కు కృతజ్ఞతలు. గగనతల రక్షణలో అమెరికా చేస్తున్న సహకారం మాకు చాలా ఉపయోగపడుతోంది. నిన్న రాత్రే మా మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగింది” అని ఆయన వివరించారు.
‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ద్వారా అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణుల నిల్వలు, కమాండ్ సెంటర్లు, పాలన యంత్రాంగానికి సంబంధించిన ప్రదేశాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని నెతన్యాహు వెల్లడించారు. టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ సైనిక చర్యల్లో కొన్ని నష్టాలు ఎదురైనా, దేశ అంతర్గత పరిస్థితి బలంగా ఉందని ఆయన హితవు పలికారు. “ఇజ్రాయెల్ ఇప్పుడు మరింత శక్తివంతమైన దేశంగా మారుతోంది. ఈ పోరాటంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని మంత్రిత్వ శాఖలను ఆదేశించాను” అని ప్రధాని నెతన్యాహు తెలిపారు.
Read More : జెలెన్‌స్కీతో తుది దశ చర్చలకు పుతిన్ సన్నద్ధత

One thought on “ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’లో ఇజ్రాయెల్ ధైర్యం”
Comments are closed.