Plane : ప్రయాణికుల ఆందోళన, పలువురు గాయాలు

శనివారం ఉదయం స్పెయిన్‌లోని పాల్మా డి మల్లోర్కా విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. విమానంలో అగ్నిప్రమాద హెచ్చరిక (ఫైర్ అలర్ట్) రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం ఇంకా గ్రౌండ్పైనే ఉండగా ఈ అలర్ట్ రావడం గమనార్హం. దీంతో కొంతమంది ప్రయాణికులు జాగ్రత్తలతో విమానం నుండి కిందకు దూకారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే విమాన సిబ్బంది అప్రమత్తమై సురక్షిత చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాద హెచ్చరిక నిజమైన అగ్నిప్రమాదం వల్లా, లేక సాంకేతిక లోపం వల్లా వచ్చిందన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

సంబంధిత విమానాశ్రయ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఘటనా సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Read More : దలైలామా భావోద్వేగం: ప్రజలకు సేవే నా ప్రధాన ఆకాంక్ష

One thought on “Plane : ప్రయాణికుల ఆందోళన, పలువురు గాయాలు

Comments are closed.