మహారాష్ట్రలోని పుణేలో ఓ యువ ఇంజినీర్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల సమాచారం ప్రకారం, నాసిక్‌కు చెందిన 23 ఏళ్ల పీయూష్ అశోక్ కవాడే హింజేవాడి ఐటీ పార్కులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సాధారణంగా సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన అతడు కంపెనీ సమావేశానికి హాజరయ్యాడు. అయితే, సమావేశం మధ్యలో అస్వస్థతగా ఉందని చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏడో అంతస్తు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన కార్యాలయ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
అదే సమయంలో పీయూష్ వద్ద సూసైడ్ నోట్ కూడా లభించింది. “నేను జీవితంలో విఫలమయ్యాను. నన్ను క్షమించండి. మీకు కొడుకుగా ఉండేందుకు నేను అర్హుడిని కాదు” అని కుటుంబ సభ్యులకు రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Read More : మేరఠ్‌లో వైద్యుడి నిర్లక్ష్యం ప్రాణం బలిగొన్న ఘటన!

One thought on “పుణేలో యువ ఇంజినీర్ ఆత్మహత్య”
Comments are closed.