సౌత్ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అభినయ. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తాజాగా తన జీవితంలో ఓ ముఖ్యమైన అంకాన్ని మొదలుపెట్టింది. అభినయ నిశ్చితార్థం జరిగిందని ప్రకటిస్తూ, ఈ సందర్భంగా ఓ అందమైన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అభినయ తన నిశ్చితార్థం సందర్భంగా కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోను షేర్ చేసింది. “మా ప్రయాణం నేటితో ప్రారంభమైంది” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. అయితే, ఫోటోలో తన కాబోయే వరుడి ముఖాన్ని మాత్రం చూపించలేదు. అతని వివరాల గురించి కూడా స్పష్టత ఇవ్వలేదు.
తెలుగు ప్రేక్షకులకు అభినయ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మరింత దగ్గరైంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల చెల్లిగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించినప్పటికీ, ఈ చిత్రమే ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే, కొన్నాళ్ల క్రితం అభినయ, హీరో విశాల్ ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ ‘పూజ’, ‘మార్క్ ఆంటోని’ చిత్రాల్లో కలిసి నటించడంతో గాసిప్స్ ఊపందుకున్నాయి. అయితే, ఈ రూమర్లపై ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు.
ప్రస్తుతం అభినయ నిశ్చితార్థం వార్త తెలిసిన అభిమానులు, ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలోనే వివాహం జరగనున్నట్లు ఆమె అఫీషియల్‌గా ప్రకటించనుంది.

2 thoughts on “నిశ్చితార్థం చేసుకున్న నటి అభినయ.. ఎంగేజ్మెంట్ ఫోటో వైరల్!”
Comments are closed.