హరిహర వీరమల్లు విడుదలపై ఏఎం రత్నం క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదలపై వస్తున్న వదంతులకు నిర్మాత ఏఎం రత్నం ఘాటుగా స్పందించారు. సినిమా పదేపదే వాయిదా పడుతోందంటూ వస్తున్న వార్తలు తాను చూస్తే బాధగా ఉందన్నారు. కొన్ని కథనాల్లో 14 సార్లు వాయిదా పడినట్టు ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రస్తుతం వరకు కేవలం మూడు సార్లు మాత్రమే వాయిదా వేశాం. మార్చి 28, మే 9, జూన్ 12 తేదీలను అనుకున్నాం. చివరకు జూన్ 12న కూడా విడుదల చేయలేకపోయాం. అది నా కెరీర్‌లో చాలా బాధ కలిగించిన రోజు. ఇప్పటి వరకు నేను నిర్మించిన ఏ సినిమా వాయిదా పడలేదు,” అని రత్నం వివరించారు.

విలంబానికి కారణాలపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. ‘‘ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది. ఇదొక చారిత్రక కథ, అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి రాజీ పడలేకపోయాం. అంతేకాదు, కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది. తరువాత ఎన్నికల కారణంగా కూడా పని నిలిచిపోయింది. బిజినెస్ లేకపోవడం వల్ల వాయిదా వేశామన్నది పూర్తిగా అసత్యం,’’ అని తెలిపారు. ఇక జూలై 24న విడుదల కానున్న ఈ సినిమా పవన్ కల్యాణ్‌కు ఒక మైలురాయిగా నిలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే ట్రైలర్ చూసిన వారు అబ్బురపడుతున్నారు. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని చెప్పారు.

Read MoRE : సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం…

One thought on “హరిహర వీరమల్లు విడుదలపై ఏఎం రత్నం క్లారిటీ

Comments are closed.