ఇండస్ట్రీలో ఒకరు అనుకున్న పాత్ర మరొకరికి దక్కడం కొత్తేమీ కాదు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎంతోమందిని ఆడిషన్ చేశారు. తమిళనాడులో పుట్టి కోలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన ప్రీతి ముకుందన్ కూడా ఈ చిత్రంలో అవకాశం కోసం ప్రయత్నించింది.
కానీ ఆ ఛాన్స్ తొలుత నుపూర్ సనన్‌కు వెళ్లింది. అనుకోకుండా నుపూర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం తిరిగి ప్రీతికి దక్కింది. దీంతో ఈ చిత్రం తనకు వరంగా మారిందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
తాజాగా, ప్రీతి ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. “ప్రభాస్‌తో కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అతనిని జీవితంలో ఒక్కసారి కలవగలనో లేదో కూడా తెలీదు. కానీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కెరీర్లోనే హై ఇచ్చిన మూమెంట్,” అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. కన్నప్ప కోసం గుర్రపు స్వారీ, ఖడ్గయుద్ధంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఓం భీమ్ బుష్ సినిమాతో పరిచయమైన ప్రీతి, ఆ సినిమా నిరాశపరిచినా కన్నప్పలో తన పాత్ర కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని నమ్ముతోంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించగా, ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

One thought on “ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ – ప్రీతి ముకుందన్‌కు లైఫ్‌లో హై ఇచ్చిన మూమెంట్!”
Comments are closed.