బాలీవుడ్ చాలా ఫేక్‌ – బాబిల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Babil Khan emotional video

ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ తాజాగా పోస్ట్ చేసిన భావోద్వేగ వీడియో ఇంటర్నెట్‌లో కలకలం రేపుతోంది. ఈ వీడియోలో బాబిల్ ఏడుస్తూ కనిపించడంతో అతడు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడన్న భావనను కలిగించింది. బాలీవుడ్‌లో ఎదురవుతున్న ఒత్తిళ్లపై తన అసంతృప్తిని బహిర్గతం చేశాడు.

వీడియోలో అనన్య పాండే, షనాయ కపూర్, అర్జున్ కపూర్ తదితరులతో తన అనుభవాల్ని చెప్పాడు. క్రూరమైన మరియు ఫేక్ పరిశ్రమగా అభివర్ణించాడు. అయితే కొంతమంది పరిశ్రమను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా పేర్కొన్నాడు.

ఈ వీడియోపై స్పందించిన బాబిల్ తల్లి సుతపా సిక్దర్, తన కొడుకు సురక్షితంగా ఉన్నాడని స్పష్టం చేశారు. బాబిల్ వ్యాఖ్యలు విమర్శలేమని, సహనటులకు చేసిన అభినందనలేనని వివరించారు. బాబిల్ మాత్రం ఆవేదనతో కూడిన భావోద్వేగాన్ని పంచుకున్నాడు.

ఈ వైరల్ వీడియోను బాబిల్ తొలగించడమే కాకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి కూడా తాత్కాలికంగా వైదొలిగాడు. ప్రస్తుతం అతడి మానసిక స్థితిపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరిశ్రమలో యువ నటులు ఎదుర్కొంటున్న మెంటల్ హెల్త్ సమస్యలపై ఈ ఘటన దృష్టిని ఆకర్షిస్తోంది.

Read More

One thought on “బాలీవుడ్ చాలా ఫేక్‌ – బాబిల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Comments are closed.