ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ నెల 22న ఘనంగా ప్రారంభం కానుంది. గత కొన్ని సీజన్లుగా ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన అద్భుత ప్రదర్శనతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. అయితే, ఈసారి ఐపీఎల్ కాకుండా తెలుగు సినీ ప్రియులకు వినోదాన్ని పంచనున్నాడు. నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రోబిన్‌హుడ్ చిత్రంలో వార్నర్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 22న డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌కు రానున్నాడు. విశేషమేంటంటే, అదే రోజున ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. గతేడాది మెగా వేలంలో అతనికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఈసారి అతను ఐపీఎల్‌లో కనిపించటం లేదు.
ఇదే సందర్భంలో రోబిన్‌హుడ్ చిత్ర బృందం వార్నర్‌ను ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌కు ఆహ్వానించింది. 22న సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్న అతను, 23న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కూడా హాజరవుతాడు.
ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథి పాత్ర పోషించగా, ఆ సన్నివేశం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

One thought on “ఐపీఎల్‌ను వదిలిన వార్నర్.. తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ!”
Comments are closed.