బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన ఫ్యాషన్ సెన్స్ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో మంచి పేరు తెచ్చుకున్న ఆమె, ఇటీవల ముంబైలో జరిగిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్‌లో మెరిసింది. ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ రచించిన ‘ది కామన్ సెన్స్ డైట్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి కరీనా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరీనా తన డైలీ డైట్, ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రత్యేకంగా, తనకు కిచిడీ అంటే ఎంత ఇష్టమో షేర్ చేస్తూ, “రెండు మూడు రోజులు కిచిడీ తినకపోతేనే నాకు క్రేవింగ్స్ వస్తాయి. అది తినకపోతే నిద్ర పట్టదు. నిజంగా చెప్పాలంటే, కిచిడీ లేకుండా నేను బతకలేను” అంటూ సరదాగా చెప్పారు. ఆ వ్యాఖ్యలు వినగానే అందరూ చిరునవ్వులు చిందించారు.
బియ్యం, పప్పులతో తయారయ్యే ఈ సింపుల్ డిష్, తేలికపాటి మసాలాలతో ఎంతో రుచిగా ఉంటుందనీ, తిన్న వెంటనే పొట్టలో తేలికగా ఉంటుంది కాబట్టి సులభంగా జీర్ణమవుతుందనీ కరీనా వివరించారు. ఫిట్‌నెస్, వెల్‌నెస్‌కు పేరొందిన కరీనా, తాను కిచిడీతో పాటు సరైన డైట్ పాటించడమే ఆరోగ్యానికి కారణమని చెప్పారు. తన ఫిట్ బాడీకి, ఎనర్జీకి, న్యూట్రిషన్ నిపుణురాలు ఇచ్చే న్యూట్రిషన్ సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని కరీనా గర్వంగా వెల్లడించారు.

One thought on “నిద్ర పట్టాలంటే కిచిడీ కావాలట – కరీనా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!”
Comments are closed.