బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అత్యాచారం కేసులో ఇరుక్కోవడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా సందర్భంగా నెట్టింట్లో సంచలనంగా మారిన మోనాలిసా అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ఆమెకు బాలీవుడ్‌లో సినిమా అవకాశాలు కూడా తలుపుతట్టాయి. ఈ క్రమంలో దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసి సినిమా చేస్తానని ప్రకటించాడు.
తాజాగా సనోజ్ మిశ్రా పై ఓ మహిళ అత్యాచారం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఘటనను మరింత సంచలనంగా మార్చింది. ఆ మహిళను లైంగికంగా వేధించి, వీడియోలు తీసి బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించి సనోజ్ మిశ్రాను అరెస్టు చేశారు. ఈ కేసు నేపథ్యంలో ఫిర్యాదు చేసిన మహిళ వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి.
సనోజ్ మిశ్రా, బాలీవుడ్‌లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ‘బీట్యాడ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి, ఆ తర్వాత ‘గాంధీగిరి’, ‘రామ్ కీ జన్మభూమి’, ‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ వంటి చిత్రాలు తీసాడు. ప్రస్తుతం ‘కాశీ టూ కశ్మీర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ కేసు బాలీవుడ్‌లో దుమారం రేపుతోంది. అనేక మంది ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

One thought on “సినిమా ఛాన్స్ ఇస్తానని మోసం: బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై అత్యాచారం కేసు”
Comments are closed.