Posani: ముగిసిన పోసాని సీఐడీ విచారణ, మరోసారి కస్టడీకి సిద్దం

posanikrishnamurali

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిపై సీఐడీ పోలీసులు నిర్వహించిన కస్టడీ విచారణ పూర్తయింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ విచారణ అనంతరం పోసానిని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ (జీజీహెచ్) కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అతడిని జిల్లా జైలుకు తరలించారు.

అయితే, పోసాని కృష్ణ మురళిని మరోసారి కస్టడీకి తీసుకుని విచారించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. దీనికోసం మళ్లీ కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఇక పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోసానిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విలేకరుల సమావేశంలో మార్ఫింగ్‌ చిత్రాలను ప్రదర్శించారనే ఆరోపణలతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి, పీటీ వారెంట్‌పై కర్నూలు జైలులో ఉన్న పోసానిని గుంటూరుకు తరలించి విచారణ చేపట్టారు.

గతంలో వైసీపీ ప్రభుత్వం పోసానిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పలు సందర్భాల్లో విలేకరుల సమావేశాల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.

ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఏపీ పోలీసులు పోసానిని అరెస్టు చేసిన విషయం విధితమే.

Read More

One thought on “Posani: ముగిసిన పోసాని సీఐడీ విచారణ, మరోసారి కస్టడీకి సిద్దం

Comments are closed.