ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోరాదంటూ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసులో అదనంగా చేర్చిన ఐపీసీ 111 సెక్షన్‌తో పాటు, మహిళను అసభ్యంగా చిత్రీకరించారన్న అభియోగాలపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ అధికారి మురళీకృష్ణ తాము ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ కోర్టు సీరియస్ అయింది. “ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?” అంటూ ప్రశ్నించింది.
విచారణ అధికారి మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీసు జారీ చేసిన హైకోర్టు, రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
Read More : పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెన్సేషనల్ కామెంట్స్..
