అమరావతి: ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టు (AP High Court) మరోసారి ఊరట కల్పించింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గతంలో పలు కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
ఇందుకు ముందు, తనపై నమోదైన కేసులను రద్దు చేయాలంటూ పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
తాజాగా, శుక్రవారం హైకోర్టు విజయవాడ సూర్యారావుపేట కేసులో పోసానిని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పోసాని తరఫున వైఎస్సార్సీపీ లీగల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.
