పోప్ ఫ్రాన్సిస్ ప్రాణాలను విడిచారు : అంత్యక్రియల కోసం వాటికన్‌లో ఏర్పాట్లు

ఇక పోప్ అంత్యక్రియల కోసం వాటికన్‌లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం మధ్య అంత్యక్రియలు నిర్వహించే అవకాశముందని, సంబంధిత షెడ్యూల్‌పై త్వరలోనే స్పష్టత వచ్చేలా ఉందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రోమ్‌లో ఉన్న కార్డినల్స్‌ను అత్యవసర సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పోప్ ఫ్రాన్సిస్ భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాకు ఎప్పుడు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

అంతేకాకుండా పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి రోమ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. ట్రంప్ ఈ సమాచారం తన ట్రూత్ సోష‌ల్ మాధ్యమం ద్వారా వెల్లడించారు.

Read More : పోప్ ఫ్రాన్సిస్ మరణం: ప్రపంచాన్ని విషాదంలో ముంచిన క్రైస్తవ మత గురువు తుది శ్వాస

One thought on “పోప్ ఫ్రాన్సిస్ ప్రాణాలను విడిచారు : అంత్యక్రియల కోసం వాటికన్‌లో ఏర్పాట్లు

Comments are closed.