బాబా వంగా 2026 జోస్యాలు: యుద్ధం, విలయం భయం

బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త బాబా వంగా చేసిన జోస్యాలు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగానే నిలుస్తాయి. “బాల్కన్ల నాస్ట్రడామస్”గా పేరుపొందిన ఆమె దశాబ్దాల క్రితమే కన్నుమూసినా… ఇప్పటికీ ఆమె చెప్పిన అనేక భవిష్యవాణులు నిజమవుతుండటం ఆశ్చర్యకరంగా మారింది. తాజా పరిస్థితుల్లో, 2026 సంవత్సరం గురించి ప్రచారంలో ఉన్న బాబా వంగా జోస్యాలు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ యుద్ధం ముప్పు, సాంకేతిక విప్లవం, అంతరిక్ష రహస్యాలు… ఈ నాలుగు అంశాలపై ఆమె చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమవుతున్నాయి.

ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, 2026లో భూమిపై తీవ్రమైన ప్రకృతి విలయాలు సంభవిస్తాయని ఆమె ముందే హెచ్చరించిందట. దాదాపు 7-8 శాతం భూభాగం భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు, వాతావరణ మార్పులతో దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇప్పటికే 2025లో ఐరోపా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడం, కెనడా-ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, పసిఫిక్ ప్రాంతంలో భూకంపాలు పెరగడం వంటి పరిణామాలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి.

అత్యంత భయాందోళన కలిగించే అంశం మూడో ప్రపంచ యుద్ధం. చైనా తైవాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని, రష్యా-అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ సంభవించవచ్చని ఆమె అంచనా వేసినట్టు సమాచారం. ఇప్పటికే మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ భయాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. సాంకేతిక రంగంలోనూ 2026 కీలక మలుపుగా మారవచ్చని బాబా వంగా జోస్యం చెప్పిందని ప్రచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులకు సహాయపడటమే కాకుండా, ముఖ్య రంగాలపై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుందని, దీనివల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తవచ్చని ఆమె హెచ్చరించిందని చెబుతున్నారు.

ఇంకా ఆసక్తికరమైన అంశం… 2026 నవంబర్‌లో గ్రహాంతరవాసులు భూమితో తొలిసారి సంప్రదింపులు జరుపుతారని, ఒక అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఆమె జోస్యం చెప్పిందని ప్రచారం.

ఈ అంచనాలు నిజమవుతాయో లేదో చెప్పలేము కానీ, ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు, సాంకేతిక మార్పులను చూస్తే… బాబా వంగా జోస్యాలు మళ్లీ ప్రపంచ చర్చకు దారితీస్తున్నాయి.

Read More : ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 71 మంది దుర్మరణం

One thought on “బాబా వంగా 2026 జోస్యాలు: యుద్ధం, విలయం భయం

Comments are closed.