తమిళ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు చేస్తున్న చివరి సినిమా ‘జననాయగన్’ పై అభిమానులు, బిజినెస్ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. విజయ్ చివరి సినిమా కావడంతో సినిమాకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఇప్పటికే ‘జననాయగన్’ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.121 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ హక్కులు సన్ నెట్‌వర్క్ రూ.55 కోట్లకు తీసుకోగా, తమిళనాడు థియేట్రికల్ హక్కులు రోమియో పిక్చర్స్ దాదాపు రూ.90 కోట్లకు లాక్ చేసినట్లు సమాచారం. ఆడియో హక్కులు టీ సిరీస్ సంస్థ రూ.15 కోట్లకు దక్కించుకుంది.
ఈ మొత్తాలన్నింటిని కలిపితే సినిమా విడుదలకముందే దాదాపు రూ.260 కోట్లకు పైగా బిజినెస్ లాక్ అయింది. ఇది దళపతి విజయ్ కెరీర్‌లోనే కాదు, కోలీవుడ్ చరిత్రలోను ఒక గొప్ప రికార్డు. విజయ్ గత సినిమాల మార్కెట్‌తో పోలిస్తే, ఈ ప్రాజెక్ట్‌పై మరింత భారీ హైప్ నెలకొన్నది.
‘జననాయగన్’ విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలికే సినిమాగా మారబోతోంది. సినిమా విడుదల సమయంలో కొన్ని రాజకీయ సంకేతాలు కూడా స్పష్టంగా కనిపించే అవకాశముందని అంటున్నారు. మరి ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందా లేదా అన్నది త్వరలో తేలనుంది.

One thought on “రిలీజ్‌కి ముందే 260 కోట్ల బిజినెస్ చేసిన ‘జననాయగన్’!”
Comments are closed.