స్టార్టప్ మహాకుంభ్ 2025లో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భారత్ స్టార్టప్ వ్యవస్థపై మాట్లాడుతూ, “మనం డెలివరీ బాయ్స్, గాళ్స్గా మిగిలిపోవాలా? లేదా దాన్ని మించి ఎదగాలా?” అంటూ చైనా-ఇండియా స్టార్టప్ ల్యాండ్‌స్కేప్‌ను పోల్చుతూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు యువ పారిశ్రామికవేత్తల్లో వివిధ ప్రతిస్పందనలను రేకెత్తించాయి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై జెప్టో సీఈవో ఆదిత్ పళిచా స్పందించారు.
X లో చేసిన పోస్ట్‌లో, తన సహవ్యవస్థాపకుడితో కలిసి ప్రారంభించిన జెప్టో కంపెనీ ద్వారా సుమారు 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించామనీ, ప్రతి సంవత్సరం సుమారు రూ. 1,000 కోట్లకు పైగా పన్ను ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని తెలిపారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, డెలివరీ రంగంలో ఉన్న యువతపై అసమ్మతి వ్యక్తమవుతోంది. పీయూష్ గోయల్ వ్యాఖ్యలు క్లిష్టంగా మారడంతో, కేంద్రం స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్లు కూడ పెరుగుతున్నాయి.
Read More : BIMSTEC summit సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారుతో మోదీ మీటింగ్

One thought on “స్టార్టప్ మహాకుంభ్‌లో పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై వివాదం..”
Comments are closed.