హన్సిక మోత్వానీపై 498-A కేసు – హైకోర్టు నోటీసు

Hansika Motwani 498-A case

ప్రముఖ నటి హన్సిక మోత్వానీ కుటుంబ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్ 498-A సెక్షన్‌ కింద కేసు నమోదు చేయగా, దీనిని రద్దు చేయాలంటూ హన్సిక బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన అన్న, వదిన మధ్య ఉన్న సమస్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదని, 2022లో పెళ్లి అయిన తర్వాత భర్తతో కలిసే ఉంటున్నానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే కేసులో హన్సికకు ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ముస్కాన్ జేమ్స్ ఆరోపణల ప్రకారం, ప్రశాంత్ మోత్వానీ కుటుంబ సభ్యులు వివాహ వేడుకల సమయంలో ఖరీదైన బహుమతులు డిమాండ్ చేయడంతో పాటు, రోకా సెర్మనీ కోసం రూ. 20 లక్షలు చెల్లించేందుకు తన ఫ్లాట్‌ను అమ్మాలని ఒత్తిడి చేశారని చెప్పారు. భర్త వేధింపుల వల్ల తనకు బెల్స్ పాల్సీ సమస్య వచ్చిందని కూడా ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, హన్సిక మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తన తల్లి పేరు కూడా అనవసరంగా లాగడాన్ని తప్పుబట్టారు.

కోర్టు ఈ వ్యవహారంపై హన్సికకు నోటీసు జారీ చేయగా, ఆమె తాను పూర్తిగా నిర్దోషినని స్పష్టం చేశారు. కాగా, సినిమాల పరంగా హన్సిక ఇటీవల తమిళ హారర్ చిత్రం గార్డియన్ లో నటించారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి.

Read More

One thought on “హన్సిక మోత్వానీపై 498-A కేసు – హైకోర్టు నోటీసు

Comments are closed.