టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అర్జున్ S/O వైజయంతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ద్వయం తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు మరింత ప్రత్యేకతను తెచ్చింది. తల్లి-కొడుకు సంబంధాన్ని హైలైట్ చేస్తూనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సినిమాపై క్రేజ్ పెరుగుతుండగా, మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 18న అర్జున్ S/O వైజయంతి గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. అంతేకాదు, రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. భారీ వెపన్‌తో మెట్లపై కూర్చొన్న కళ్యాణ్ రామ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్‌లో ఈ సమ్మర్ సీజన్‌లో అర్జున్ S/O వైజయంతినే బిగ్గెస్ట్ రిలీజ్‌గా చెబుతున్నారు. భారీ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్ అయిన ఈ సినిమా, కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత పెద్ద విడుదలగా నిలవనుంది. విజయశాంతి, కళ్యాణ్ రామ్ కలిసి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించగా, మేకర్స్ కూడా గ్రాండ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ముప్పా అశోక్ చౌదరి, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం సూపర్ హిట్ సాధిస్తుందేమో వేచి చూడాలి!

One thought on “అర్జున్ S/O వైజయంతి.. గ్రాండ్ రిలీజ్‌కు రెడీ!”
Comments are closed.