ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు.

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తలెత్తింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.

నెలల తరబడి అమెరికాలో ఉన్న ఆయన, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిన్న హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత మూడు రోజుల్లోగా అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించగా, ఆయన సోమవారం విచారణకు హాజరయ్యారు. తుది ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభాకర్‌రావుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్న, భూజంగరావుల‌ను అరెస్టు చేశారు. వీరందరి నుంచి వచ్చిన ఆధారాల ఆధ్వారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటి నుంచీ ప్రభాకర్ రావు అమెరికాలో ఉండిపోయారు. దీంతో భారత అధికారులు ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు ఆయన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. తిరిగి వచ్చేందుకు ఆయన భారత రాయబార కార్యాలయం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారని ఆయన న్యాయవాది పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్నప్పుడు ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి ఓ నమ్మకమైన బృందాన్ని ఏర్పాటు చేసి అనధికారికంగా పలువురు రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం గత ఏడాది మార్చిలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ విచారణతోPhone tapping కేసు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది.

read More ; గంటన్నరపాటు కొనసాగిన సుదీర్ఘ విచారణ

One thought on “ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు.

Comments are closed.