హైదరాబాద్ నగర వాసులకు మరోసారి ప్రయాణ ఖర్చుల భారంగా మారుతోంది. ఇటీవలే మెట్రో రైల్ టికెట్ ధరలు పెరిగిన నేపథ్యంలో, ఇప్పుడు ఆర్టీసీ కూడా బస్ పాస్ రేట్లను పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉపయోగించే ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.1,150 నుంచి రూ.1,400కు పెరిగింది. అదే విధంగా మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ధరను రూ.1,300 నుంచి రూ.1,600కి పెంచారు.
ఈ పెంపుతో ఉద్యోగులు, విద్యార్థులు, రోజూ బస్సుల్లో ప్రయాణించే ప్రజలు తీవ్రమైన ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మెట్రో రైలు టికెట్ల ధరలను మెట్రో యాజమాన్యం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. మాస పాస్ ధరల్లో వరుసగా ఈ విధంగా పెంపులు జరగడంతో, సాధారణ ప్రజానికం భవిష్యత్తులో మరింత ఖర్చులను భరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
read More : ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు.
