సంగారెడ్డి జిల్లా పస్తాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లను అందజేస్తామని వెల్లడించారు. మెదక్ జిల్లా మరియు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన, “మెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా” అని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మరిచిపోదని అన్నారు.
జహీరాబాద్‌ను ‘గేట్‌వే ఆఫ్ ఇండస్ట్రీస్’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి చర్యలు చేపడుతుందని సీఎం హామీ ఇచ్చారు. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక సమీక్ష జరిపి, అవసరమైన నిధులను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. పటాన్‌చెరు ప్రాంతాన్ని మినీ ఇండియాగా అభివృద్ధి చేయాలని, సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కేంద్రంగా మార్చాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను తమ ప్రభుత్వం చేపట్టినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలతో పోటీ పడేందుకు మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తామని తెలిపారు.
స్థానికంగా చక్కెర పరిశ్రమ ఏర్పాటుకు రైతులు సహకార సంఘాలుగా ఏర్పాటు అయితే, నిమ్జ్‌లో వంద ఎకరాల భూమిని కేటాయించి, అవసరమైన నిధులను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సభలో సీఎం ప్రకటనలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Read More : మంత్రి కోమటిరెడ్డి, డీకే అరుణ ఘాటుగా స్పందన.

One thought on “జహీరాబాద్ అభివృద్ధికి కీలక ప్రకటనలు చేసిన సీఎం.”
Comments are closed.