మేఘాలయ హనీమూన్ హత్యకేసులో రాజా తల్లి సంచలన ఆరోపణలు.

హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో రాజా తల్లి ఉమా రఘువంశీ తన కోడలు సోనమ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడి హత్యకు సోనమ్ హస్తం ఉందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడలు కిరాయి హంతకులతో పథకం ప్రకారం రాజాను హత్య చేయించిందని ఆమె ఆరోపించారు.

ఈ ఘటనపై ఇండియా టుడే టీవీతో మాట్లాడిన ఉమా రఘువంశీ – “రాజాకు ఆ ట్రిప్‌ మీదే ఇష్టం లేదు. అయినప్పటికీ సోనమ్ తమ కుటుంబానికి తెలియజేయకుండా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మేఘాలయకు తీసుకెళ్లింది. ఇది పూర్వ ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యే. నిజంగా ఆమె దోషిగా తేలితే, ఆమెకు తప్పక మరణశిక్ష విధించాలి” అని స్పష్టం చేశారు.

ఇటీవలే వివాహం చేసుకున్న రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్‌ టూర్లో భాగంగా మేఘాలయ వెళ్లగా, అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించగా, తాజాగా కోడలపై తల్లి చేసిన ఆరోపణలు కేసు మలుపు తిప్పనున్నాయి. సోనమ్‌పై ఉమా చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. పోలీసులు ఈ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Read More : మహాకుంభమేళా తొక్కిసలాటపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం

One thought on “మేఘాలయ హనీమూన్ హత్యకేసులో రాజా తల్లి సంచలన ఆరోపణలు.

Comments are closed.