ప్రపంచంలోని వివిధ దేశాల్లో పెట్రోల్ ధరలతో పోలిస్తే భారత్‌లో అధికమే!
ప్రస్తుతం లీటర్‌కు సగటు పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి:
- భారత్: రూ.101
- చైనా: రూ.94.5
- అమెరికా: రూ.79.4
- రష్యా: రూ.67.1
- బంగ్లాదేశ్: రూ.85
- పాకిస్తాన్: రూ.80.4
- ఇరాన్: కేవలం రూ.2.4
ఈ ధరలను పరిశీలిస్తే, అభివృద్ధి చెందిన దేశాలతో పాటు పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా కూడా భారత్‌లో పెట్రోల్ చాలా ఎక్కువ ధరకు విక్రయమవుతోందని స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇరాన్‌లో ధర ఎంతో తక్కువగా ఉండటం గమనార్హం.
ఇంతటి ధర వ్యత్యాసం దేశాల్లో ఇంధన విధానాలు, పన్నుల విధానం, ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ వ్యయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇదంతా చూస్తే సామాన్యుడిపై పెట్రోల్ ధర భారం స్పష్టంగా పడుతోందని చెప్పవచ్చు.
Read More : బంగ్లాదేశ్‌లో ‘సర్’ సంబోధనపై కీలక నిర్ణయం

One thought on “భారత్‌లో పెట్రోల్ ధర ప్రపంచంతో పోలిస్తే అధికం!”
Comments are closed.