జమ్మూకాశ్మీర్‌లో శుక్రవారం ఉదయం నుంచి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. బందిపొరాలో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. నిఘా వర్గాల సమాచారంతో, బందిపొరాలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ముష్కరులు కాల్పులకు దిగారని, దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మృతిచెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంపై ఇంకా ఆర్మీ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
Read More : భారత్ చర్యలు ప్రారంభం

2 thoughts on “జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల, భద్రతా దళాల మధ్య ఎన్ కౌంటర్”
Comments are closed.