భారత వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని సేల్ ఆఫర్ల సమయంలో భారీగా నకిలీ వెబ్‌సైట్లు పనిచేస్తున్నట్టు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ వెల్లడించింది. అమెజాన్ పేరుతో రూపొందించిన 36,000కి పైగా నకిలీ వెబ్‌సైట్లను ఆ సంస్థ గుర్తించింది. ఈ ఫేక్ సైట్లు వినియోగదారులను మోసపూరితంగా ఆకర్షించేందుకు అత్యవసర పరిస్థితులలా చూపిస్తూ మోసపూరిత మెసేజ్‌లు పంపుతున్నాయని మెకాఫీ హెచ్చరించింది. తక్షణంగా ఆఫర్ తిప్పేస్తారని భయపెట్టి, వినియోగదారులు ఆలోచించకుండా లింక్ క్లిక్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఎప్పుడైనా లింక్ క్లిక్ చేసే ముందు దాని యొక్క నిజమైనతనాన్ని, వెబ్‌సైట్ నకిలీ కాదా అనే విషయాలను బాగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీ ఆర్థిక సమాచారాన్ని రక్షించుకోవడానికి నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.
Read More : భారత్‌లో పెట్రోల్ ధర ప్రపంచంతో పోలిస్తే అధికం!

One thought on “అమెజాన్ ఆఫర్ల పేరుతో వంచనలు..”
Comments are closed.