YSRCP లీడర్ మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ

మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన చందు, శ్రీహర్షలపై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. విచారణకు హాజరుకావాలని కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరుకాలేదు. దీంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. పోలీసులు ఆయనను అరెస్టు చేసి తదుపరి విచారణకు హాజరు పరచాలని ఆదేశించింది. ఇక తదుపరి విచారణను సెప్టెంబర్ 19కు వాయిదా వేసింది.

Read More : విశాఖలో యోగాంధ్ర ఏర్పాట్లను సమీక్షించిన సీఎం

One thought on “YSRCP లీడర్ మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ

Comments are closed.