నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో అరాచకం సృష్టించాలని మాజీ సీఎం జగన్ చూస్తున్నారని ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల అన్నారు. మన జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. బనకచర్లపై జగన్ మాటలను చరిత్ర క్షమించదన్నారు. నంద్యాల జిల్లా మల్కాల పంపింగ్ స్టేషన్ వద్ద హంద్రీనీవా కాల్వకు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పయ్యావుల మాట్లాడారు.
కేవలం 100 రోజుల్లోనే హంద్రీనీవా కాల్వ సామర్థ్యాన్ని 12 పంపులకు పెంచాం. వైసీపీ హయాంలో గంప మట్టి కూడా తీయలేని పరిస్థితి నెలకొందని, జగన్ మళ్లీ పాలెగాళ్ల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. రాయలసీమను అభివృద్ధి చేసింది మా పార్టీయే. మీ వైపు ఎంతమంది మారినా.. మా వైపు ఒకే నాయకుడు ఉన్నారు. వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు అని పయ్యావుల కేశవ్ విమర్శించారు.

One thought on “జగన్ పై పయ్యావుల కీలక వ్యాఖ్యలు”
Comments are closed.