సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన..

Pawan Kalyan's son injured in fire accident

సింగపూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో పవన్ కల్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరుకుని నేరుగా ఆసుపత్రికి వెళ్లారు.

తన కుమారుడిని కలిసిన పవన్ కల్యాణ్, చేతులు, కాళ్లకు తీవ్ర కాలిన గాయాలు కాగా, ఊపిరితిత్తుల్లోకి పొగ ప్రవేశించడం వల్ల మార్క్‌ను అత్యవసర విభాగంలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. పవన్ కల్యాణ్ అక్కడి వైద్యులు, ఆసుపత్రి అధికారులతో సమావేశమై వైద్య చికిత్సపై సమీక్ష నిర్వహించారు.

వైద్యుల ప్రకారం, మార్క్ శంకర్ పరిస్థితి మెరుగవుతున్నట్టు తెలిసింది. శ్వాస సంబంధిత సమస్యలపై ఇంకా పరీక్షలు నిర్వహిస్తామని వారు తెలిపారు. బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి సాధారణ గదికి మార్చినట్లు సమాచారం. ఇక మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి పరిశీలన కొనసాగనుంది.

Read More : సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదం: మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన