రజినీకాంత్ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో నరసింహా ఒకటి. తమిళంలో ‘పడయప్ప’గా వచ్చిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా, అద్భుత విజయం సాధించింది. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించగా, ముఖ్యంగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చేసిన నటనకు విపరీతమైన ప్రశంసలు లభించాయి. ఒక టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడం ఆమె ధైర్యాన్ని ప్రతిబింబించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నరసింహా సినిమాలోని నీలాంబరి పాత్రను రాస్తున్న సమయంలో, తనకు వచ్చిన ప్రేరణ మరెవరో కాదు.. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అని తెలిపారు. ఆమె వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, స్ట్రాంగ్ ప్రెజెన్స్ అతనికి నీలాంబరి పాత్రకు స్పూర్తిగా నిలిచినట్లు చెప్పారు. అయితే ఈ విషయం వెల్లడించినప్పటికీ, జయలలిత నుంచి ఎలాంటి స్పందన రాలేదని కూడా అన్నారు.
ఈ వ్యాఖ్యలతో రవికుమార్ పేరు మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ వంటి టాప్ హీరోలతో పనిచేసిన దశాబ్దాల అనుభవం ఉన్న దర్శకుడు. నరసింహాలో రజినీకాంత్ పాత్రకంటే రమ్యకృష్ణ నీలాంబరి పాత్ర మరింత హైలైట్ కావడంలో రవికుమార్’s స్టోరీ టెల్లింగ్ స్కిల్ స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు నీలాంబరి పాత్ర వెనక కథ తెలిసిన తర్వాత, ఆ పాత్రకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.

One thought on “నరసింహా నీలాంబరి పాత్రను నిజంగా ఆమెని చూసి రాశారా?”
Comments are closed.