విజయవాడలోని ఏపీసీసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలైన షర్మిల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు, ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రెండు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆందోళన తారాస్థాయికి చేరడంతో కొందరు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం పై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న వేళ పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు కేంద్రం వైఫల్యమే కారణమని షర్మిల వ్యాఖ్యానిస్తూ… దేశ భద్రతా వ్యవస్థలు ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. పహల్గామ్ దాడికి బాధ్యత వహిస్తూ మోదీ, అమిత్ షాలు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
Read More : రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు..

One thought on “విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.”
Comments are closed.