ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల విపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘పుష్ప’ సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో అలాంటి మాటలు ప్రాధాన్యం లేవని, సినిమా డైలాగులు సినిమా హాల్స్‌కే పరిమితం కావాలని పవన్ స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో శాంతిభద్రతల పర్యవేక్షనలో భాగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, “రప్పా రప్పా అంటూ సినిమాల్లో చెప్పే మాటలు వాస్తవ జీవనానికి వర్తించవు. అవి ప్రేక్షకుల వినోదానికి మాత్రమే. చట్టం, నిబంధనలపై ఎవరికైనా గౌరవం ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామిక ధోరణుల్లో కించపరచే వ్యక్తులను ప్రజలు గమనించాలి” అని అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అన్నివేళలా శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. “ప్రజల్లో భయాందోళనలు కలిగించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సహించదు” అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
Read More : విశాఖలో యోగా వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్

One thought on “జగన్ వ్యాఖ్యలపై పవన్ ఘాటు స్పందన”
Comments are closed.